ఎటువంటి హీరోయిజం లేకుండా..కథను మాత్రమే నమ్ముకుని సినిమాలు తీసే అతి కొద్ది మంది దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. సినిమా రిజల్ట్‌తో పనిలేకుండా..కథతోనే విమర్శకుల నోళ్లు మూయించగల సత్తా ఉన్న దర్శకుడు చంద్రశేఖర్. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి..తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చేస్తున్న చిత్రం 'మనమంతా'. వన్ వరల్డ్-ఫోర్ స్టోరీస్ అంటూ చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మనమంతా ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ని అందుకుంటోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్నాడట. ఎన్.టి.ఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారేమో..ఎన్.టి.ఆర్. అంటే ఇక్కడ నందమూరి తారక రత్న. ఇప్పటి వరకు లేనిది తాజాగా..తారకరత్న ఈ మూవీలో వచ్చి చేరడంతో..అసలు తారకరత్న పాత్ర ఏమైవుంటుంది? చంద్రశేఖర్ యేలేటి ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్‌ని ఎందుకు రివీల్ చేయలేదు? ఇటీవల నారా హీరోతో 'రాజా చేయి వస్తే' చిత్రం చేసి..ఎటువంటి పాత్రనైనా చేయడానికి నేను సిద్దం అనే హింట్ ఇచ్చిన తారకరత్నని ఈ మూవీలో ఎటువంటి పాత్ర కోసం యేలేటి వాడుకున్నాడు? అనేది తెలియాలంటే ఆగస్ట్ 5 వరకు వేచిచూడాల్సిందే..!