Advertisementt

ఐశ్వర్యరాయ్‌ ని నెట్టి, ఆధ్య ని పడేశారు!!

Mon 25th Jul 2016 05:31 PM
aishwarya rai,aadhya,vrundha,mumbai airport,fans and media attack  ఐశ్వర్యరాయ్‌ ని నెట్టి, ఆధ్య ని పడేశారు!!
ఐశ్వర్యరాయ్‌ ని నెట్టి, ఆధ్య ని పడేశారు!!
Advertisement
Ads by CJ

సెలబ్రిటీ అయితే చాలు..నిజంగా అభిమానమో..లేక కావాలని చేస్తున్నారో..తెలియదు కానీ..ఈ మధ్య హీరోయిన్‌లు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. షాప్‌ ఓపెనింగ్స్‌కి వచ్చి ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు చేదు అనుభవాన్ని ఫేస్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫ్యామిలీతో బయటికి వచ్చిన మాజీ ప్రపంచ సుందరి, బిగ్‌ బి కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కూడా తాజాగా ఛేదు అనుభవాన్ని ఫేస్‌ చేసింది. తల్లి వృందా, కూతురు ఆద్యలతో లండన్‌ నుండి ముంబాయ్‌ వచ్చిన ఐశ్వర్యకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఛేదు అనుభవం ఎదురైంది. మీడియా వారి అత్యుత్సాహం, అభిమానుల అంతులేని తనం ఐశ్వర్యరాయ్‌కి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. వీరంతా ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి వారి మీద పడటంతో తేరుకోవడానికి ఐశ్వర్యకు 5నిమిషాలు పట్టిందట. ఈలోపు ..ఆమె బాడీగార్డ్‌ ఓ ఫోటోగ్రాపర్‌ని ప్రక్కకు నెట్టడంతో..అతను వెళ్ళి ఐశ్వర్యరాయ్‌ తల్లి వృంద మీద పడటంతో..ఆమె కూడా పట్టుతప్పి క్రింద పడిపోయిందట. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే టైమ్‌లో ఆద్యకి ఎమర్జెన్సీ డోర్‌ తగిలి పడిపోవడం.. చూసిన ఐశ్యర్య..ఒక్కసారిగా మీడియా, అభిమానులపై బిగ్గరగా.. చిన్నపిల్ల, వృద్దురాలు అని కూడా లేకుండా..ఒక్కసారిగా మీదపడి..ఇలా ఓవర్‌ చేస్తారా..అంటూ ఐశ్వర్య కేకలు వేయడంతో...మీడియా, అభిమానులు అక్కడి నుండి జారుకున్నారంట. ఆ తర్వాత పడిపోయిన తన తల్లి, కూతుర్ని తీసుకుని ఐశ్వర్యరాయ్‌ వెళ్ళిపోయిందట.ఈ విషయం తెలుసుకున్న బిగ్‌బి ఫ్యామిలీ తీవ్ర నిరాశకులోనైందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ