Advertisementt

క్యాష్‌ చేసుకోవాలని..'కబాలి' చేయలేదంట!

Mon 25th Jul 2016 05:20 PM
pa rajinit,kabali director,kabali director about movie result,pa ranjit about rajinikanth  క్యాష్‌ చేసుకోవాలని..'కబాలి' చేయలేదంట!
క్యాష్‌ చేసుకోవాలని..'కబాలి' చేయలేదంట!
Advertisement
Ads by CJ

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రానికి మొదటిషో నుండే ఫ్లాప్‌టాక్‌ వచ్చింది. రజనీ నుంచి అందరూ ఆశించే మాస్‌ అంశాలేవీ ఈ చిత్రంలో లేకపోవడంతో ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయినా కూడా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఓపెనింగ్స్‌ విషయంలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100కోట్లమార్క్‌ను ఈ చిత్రం క్రాస్‌ చేయడం విశేషం. కాగా ఈచిత్రాన్ని రజనీ అభిమానులను మెప్పించేలా తీయడంలో చిత్ర దర్శకుడు రంజిత్‌ పా పై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతో ఈ చిత్రం విషయంలో దర్శకుడు నోరు విప్పాడు. 'కబాలి' చిత్రంను మొదటి నుంచి వీలైనంత రియలిస్టిక్‌గా తీయాలని డిసైడ్‌ అయ్యాం. అందుకే అనవసర హంగామా లేకుండా జాగ్రత్త పడ్డాం. ఇంతవరకు రజనీసార్‌ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకునే చిత్రాలు అనేకం వచ్చాయి కానీ నేను మాత్రం ఆయనలోని అద్బుత నటుడిని ఆవిష్కరించాలని అనుకున్నాను. ఈ చిత్రం విషయంలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాగే నన్ను మెచ్చుకుంటూ కూడా కొందరు ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి నాకు కమర్షియల్‌ చిత్రాలు చేయడం చేతకాదు. అందులో అన్ని అబద్దాలే చూపించాల్సి వస్తుంది. నాకు అది చేతకాదు.. అంటూ చెప్పుకొచ్చాడు రంజిత్‌పా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ