Advertisementt

పవన్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశాడు...!

Mon 25th Jul 2016 02:05 PM
  పవన్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశాడు...!
పవన్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశాడు...!
Advertisement
Ads by CJ

పవన్‌ నటించే తాజా చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను తీసుకున్నట్లు కన్‌ఫర్మ్‌ చేసిన నిర్మాత శరత్‌మరార్‌ తాజాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురించి అనౌన్స్‌ చేశాడు. ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహించాల్సిన ఈ మూవీ జులైలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సివుండగా, ఈ చిత్రం నుంచి సూర్య వైదొలగడం, ఆస్దానంలో డాలీ సీన్‌లోకి రావడం వల్ల కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే పూజాకార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగష్టు 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించుకోనుందని శరత్‌మరార్‌ తెలియజేశారు. ఈ చిత్రం షూటింగ్‌ను ఏకధాటిగా జరిపి చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్‌ చేస్తున్నారు. 100రోజుల్లో ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో.. ఇది పవన్‌ అభిమానులకు తీపి వార్తే అని చెప్పవచ్చు. పవన్‌ ఇటీవల నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అందరినీ తీవ్రంగా నిరాశపరచడంతో ఎలాగైనా ఈ చిత్రంతో అందరినీ అలరించేలా, ఓ సూపర్‌హిట్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని మలచాలని పవన్‌ కసితో ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ