ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన కొందరు హీరోయిన్లు ప్రస్తుతం భారీ చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తూ, ఆయా చిత్రాల విజయంలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా రమ్యకృష్ణ, నదియాలను చెప్పవచ్చు. 'బాహుబలి' చిత్రంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర వహించింది. ఇక నదియా కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇదే కోవలో చేరాలని నిన్నటి తరం హీరోయిన్ టబు కూడా నిర్ణయించుకుందని సమాచారం. ప్రస్తుతం 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో 'భాగమతి' అనే చిత్రం నిర్మితంకానున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్‌లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో టబూ అనుష్కకు తల్లిగా నటించనుందని సమాచారం. మొదట ఈపాత్రకు నదియాను అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ పాత్రకు టబూను ఎంపికచేశారని సమాచారం.