23వ తేదీన సర్‌ప్రైజ్ న్యూస్ చెబుతానన్న అక్కినేని నాగార్జున ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏమిటో తెలిసిపోయింది. ప్రస్తుతం నాగార్జున హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'నిర్మలా కాన్వెంట్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్రను కూడా పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రంలో నాగార్జున చాలా కాలం తర్వాత మరలా తన గొంతును సవరించుకొని ఓ పాటను స్వయంగా పాడాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటను నాగార్జున ఎ.ఆర్.రెహ్మాన్ తనయుడు అమీన్‌తో కలసి పాడాడు. గతంలో నాగ్ తాను నటించిన 'సీతారామరాజు' చిత్రంలో సిగరెట్టు మీద ఓ పాట పాడి అందరినీ అలరించాడు. మరలా ఇంతకాలం తర్వాత ఆయన తన గొంతు సవరించుకున్నాడు.