కాంగ్రెస్‌పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రత్యేకహోదా ప్రైవేట్ బిల్లును ఎదుర్కొని కాంగ్రెస్ బిల్లు విషయంలో చర్చ జరగకుండా కాంగ్రెస్‌ను అడ్డుకున్న విధానం ఏపీ ప్రజలకు మరోసారి కడుపుమంటకు గురిచేసింది. చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే ధోరణిలో కాకుండా ఈ బిల్లుపై చర్చ జరిపి తన ఎత్తులతో కాంగ్రెస్‌ను చిత్తుచేయకుండా బిజెపి వ్యవహించిన విధానం రాష్ట్రంలోని బిజెపి నాయకులకు కూడా తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ వ్యూహాన్ని తాము సమర్దవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని ఏపీ బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీ ఈ విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుందని, ఏపీలో బిజెపిని పటిష్టం చేయాలని భావిస్తున్న తమకు తమ అధిష్టానం నిర్వాకంతో తలవంపులు వస్తున్నాయని... ప్రత్యేక హోదా విషయంలో తమను దోషిగా నిలబెట్టడంతో కాంగ్రెస్ విజయం సాధించిందని, క్షేత్రస్తాయిలోకి కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ తీసుకొని పోవడం బిజెపి నాయకులకు మింగుడుపడటం లేదు. దాంతో ఇక తమకు ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని బిజెపి నాయకులు నిరాశలో మునిగిపోయి ఉన్నారు.