కాజల్ ఇటీవల 'సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం' వంటి చిత్రాల డిజాస్టర్స్‌లో ఉంది. హిందీలోను ఆమె పరిస్దితి ఇదే. అయితే ఈమెను చిరంజీవి, వినాయక్‌ల కాంబినేషన్‌లో రూపొందే 150వ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని రామ్‌చరణ్ భావించాడట. వాస్తవానికి చరణ్, కాజల్‌లు హిట్ పెయిర్. అంతేకాదు... మంచి ఫ్రెండ్స్ కూడా. అందులోనూ ఫ్లాప్‌లో ఉంది. ఆమెను గతంలోనే నాగబాబు తన కూతురులాంటిదని ప్రకటించాడు. ఇలా మెగాఫ్యామిలీకి దగ్గరి మనిషి కావడంతో ఆమెను చిరు సరసన తీసుకోవాలని చరణ్ సంప్రదించగా ఆమె ఈ చిత్రం కోసం ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో నోరెళ్లపెట్టడం చరణ్ వంతైంది. తనకు ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేక ఈ రేట్ చెప్పిందా? లేక చిరంజీవికి మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇలా డిమాండ్ చేసిందా? అనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఆమె పారితోషికం ప్రసుతం కోటి కంటే తక్కువగానే ఉంది. వరుస ఫ్లాప్‌లో ఉంది. మరి ఆమె ఇంత రెమ్యూనరేషన్ ఎందుకు చెప్పినట్లు?