Advertisementt

మహేష్-మురుగదాస్‌ల పై పరిణితి ఫైర్!

Sun 24th Jul 2016 04:46 PM
parinithi chopra,mahesh babu,murugadoss,fire  మహేష్-మురుగదాస్‌ల పై పరిణితి ఫైర్!
మహేష్-మురుగదాస్‌ల పై పరిణితి ఫైర్!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో మొదట బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణితి చోప్రాను అనుకున్నారు. ఆ వెంటనే మీడియాలో పరిణితి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పారితోషకంలో విభేదాలు వచ్చి ఆమెను పక్కనపెట్టారని, ఆ స్దానంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను తీసుకున్నట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎట్టకేలకు పరిణితి చోప్రా నోరువిప్పింది. తనకు మహేష్‌ చిత్రంలో నటించమని ఆఫర్‌ వచ్చిన సంగతి నిజమేనని ఆమె తెలిపింది. కానీ కాల్షీట్స్‌ చూసుకొని ఏ విషయం చెబుతానని ఆ చిత్రం యూనిట్‌కు చెప్పాను. కానీ అంతలోనే ఈ చిత్రంలో నేను నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే నేను ఎక్కువ రెమ్యూనరేషన్‌ అడిగినందువల్ల తనను ఆ సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అసలు ఆ సినిమాకు నేను సైన్‌ చేయందే తాను తప్పుకున్నట్లు వార్తలు రావడం తనని భాదించిందని వాపోయింది. ఈ విషయాలను లీక్‌ చేసిన యూనిట్‌ సభ్యుల మీద, మీడియా మీద ఆమె సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ