దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన తీసిన పలు చిత్రాలు కళాఖండాలుగా నిలిచాయి. ఇటీవల కొద్దికాలంగా ఆయన తీసిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో మణిరత్నం పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. కానీ తాను మాత్రం ఈ జనరేషన్ అభిరుచికి తగ్గట్లుగా మారి ఆయన తీసిన 'ఓకే బంగారం' చిత్రం మరలా ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చింది. మణిరత్నం ఈమధ్య కార్తి, నాని, నిత్యామీనన్, సయామీ ముఖ్యపాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేశాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆయన కార్తి, ఆదితిరావు హైదర్‌లు జంటగా ఓ రొమాంటిక్ డ్రామాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఆయన చేయాలనుకుని ఆగిపోయిన కార్తి,నాని, నిత్యామీనన్, సయామిల చిత్రం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సయామి మాట్లాడుతూ, మణిరత్నం సార్ ప్లాన్ చేసిన మల్టీస్టారర్ చిత్రం ఆగిపోలేదని, ఈ ఏడాది చివరలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపింది. మొత్తానికి నాని నటించే మణిరత్నం చిత్రం ఆగిపోలేదన్న వార్త అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది.