ఒకప్పుడు పోలీస్ పాత్రలను చేయడంలో రాజశేఖర్ కింగ్‌గా ఉండేవాడు.ఆయన నటించిన పలు పోలీస్ చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు ఎంతో క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కానీ ఈమధ్యకాలంలో రాజశేఖర్‌కు అసలు సినిమా అవకాశాలే రావడం లేదు. విలన్ వేషాలు వేస్తానని చెప్పినప్పటికీ.. తేజ దర్శకత్వం వహించనున్న 'అహం' చిత్రంలో విలన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. కాగా ప్రస్తుతం రాజశేఖర్ 'గుంటూరు టాకీస్' ఫేమ్ ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో పోలీస్ పాత్రను చేయనున్నాడు.ఈ చిత్రం హాలీవుడ్ మూవీ 'డై హార్డ్'కు ఫ్రీమేక్‌గా రూపొందనుందని సమాచారం. పోలీస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో బ్రూస్‌విల్లీస్ పాత్రను పోలిన పోలీస్ పాత్రను రాజశేఖర్ పోషించనున్నాడని సమాచారం. ఈ చిత్రంతో మరలా రాజశేఖర్‌కు పూర్వవైభవం వస్తుందని ఆశపడుతున్నారు.