Advertisementt

మాయావతికి మాంచి అస్త్రం దొరికింది!

Sat 23rd Jul 2016 07:33 PM
mayavathi,bjp,dalit,dayasankar singh,uttar pradesh  మాయావతికి మాంచి అస్త్రం దొరికింది!
మాయావతికి మాంచి అస్త్రం దొరికింది!
Advertisement
Ads by CJ

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలామంది ఎస్పీ, బీఎస్పీ నాయకులు వారి పార్టీలకు బై చెబుతూ బిజెపి పంచన చేరుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా రాజకీయ సమీకరణాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. ఈ సమయంలో బిజెపి నేత దయాశంకర్‌సింగ్‌ మాయావతిపై కొన్ని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. వాటిల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఓ దళిత మహిళను ఇలా కించపరుస్తున్న బిజెపిని దళిత వ్యతిరేక పార్టీగా మాయావతి అండ్‌ కో ప్రచారం చేస్తున్నారు. వీరి వాదనకు దళితులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం మాయావతికి ఓ వరంగా మారిందనేది మాత్రం వాస్తవం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ