ఈ మధ్య హీరోయిన్స్ అందరూ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేసేస్తున్నారు. నిన్న గాక మొన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయ్యి వెండితెర మీద దర్శనమిచ్చిన అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అనసూయ అలా ఫోటో షూట్ చేసిందో లేదో ఇలా సోషల్ మీడియా లో ఆ పిక్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోస్ చూసిన వారంతా అనసూయ కు సినిమా అవకాశాలు రాక ఇలా చేసిందని... ఇలా హాట్ హాట్ ఫొటోస్ దిగితే అవకాశాలు అవే వెతుకుంటూ వస్తాయని ఆ పని చేసిందని అన్నారు.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ స్కోప్ మ్యాగజైన్ కి హాట్ హాట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి కూడా సోషల్ మీడియా లో ప్రచారమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెజీనా కూడా ఒక ఫోటో షూట్ చేయించుకుంది. ఒకప్పుడు రెజీనా చేతినిండా సినిమాలతో బిజీ గా ఉండేది. ఆ సినిమాలలో రెజీనా పెద్దగా గ్లామర్ గా కనిపించలేదు. విషయమేమైనా గాని ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ మధ్యన సినిమాలు లేక ఖాళీ అయిన రెజీనా మళ్ళీ బిజీ అవ్వడానికి గ్లామర్ గా, హాట్ హాట్ గా ఒక ఫోటో షూట్ చేయించుకుంది. సినిమాల్లో మడికట్టుకుని కూర్చుంటే కుదరదని ఎక్సపోజింగ్ చేస్తేనే కొన్నాళ్ళు ఇండస్ట్రీలో నిలబడగలమని తెలుసుకునే ఇలా హాట్ గా ఫోటో షూట్ చేయించుకుందని ఆమె ఫొటోస్ చూసిన వారు అనుకోవడం విశేషం. మరి విషయమేమైనా గాని రెజీనా హాట్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.