Advertisementt

రాహుల్‌ రూట్ అదే..!

Sat 23rd Jul 2016 07:11 PM
rahul gandhi,rss,gandhi family,gandhi murder  రాహుల్‌ రూట్ అదే..!
రాహుల్‌ రూట్ అదే..!
Advertisement
Ads by CJ

2014 ఎన్నికల సందర్బంగా జరిగిన సభలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరెస్సెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గాంధీని చంపింది ఆరెస్సెసే నంటూ మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆరెస్సెస్‌ రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఏ ఆధారంతో చేశారని రాహుల్‌ను సుప్రీం కోర్టు వివరణ కోరింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదా విచారణను ఎదుర్కోవాలని సూచించింది. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు రాహుల్‌గాంధీ నోరువిప్పలేదు. కానీ పార్టీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌ మాత్రం గాంధీ కుటుంబం ఎప్పుడు, ఎవ్వరికీ క్షమాపణ చెప్పదంటూ చెప్పుకొచ్చారు. కావాలంటే విచారణకు సైతం సిద్దమని ఆయన తెలిపారు.సో...ఈ విషయంలో ఇక రాహుల్‌గాంధీ విచారణకే సిద్దమవుతున్నట్లు అర్ధమవుతోంది. కోరి కొరవితో తలగొక్కోవడమంటే ఇదేనేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ