నిన్నటివరకు అధికార టిడిపి పార్టీ కేవలం వైసీపీని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరలా ఏపీలో కోలుకునే పరిస్తితి లేదని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు టిడిపివైపు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్‌పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. జిల్లాలోని స్దానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా నాయకుడు దేశాయి తిప్పారెడ్డి చేతిలో సింగిల్ ఓటు తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నరేష్‌కుమార్‌రెడ్డి ఈనెల 25న టిడిపిలో చేరనున్నారు. సింగిల్ ఓటు ఓటమి నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించి ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఆయన కాలుపెట్టారు.