గత ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనాయకులు కూడా ఆ పార్టీని వీడి అధికార టిఆర్‌ఎస్ తీర్దం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ పార్టీకి మరో షాక్ తగలనుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నెంబర్‌టూగా చక్రం తిప్పిన దివంగత మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పనున్నారు. అయితే ఆమె అధికార టిఆర్‌ఎస్‌లో కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె జానారెడ్డితో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇక తెలంగాణలో టిడిపికి మనుగడ లేదనే విషయాన్ని గ్రహించే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మొత్తానికి ఇది టిడిపికి పెద్ద షాక్ కిందనే చెప్పాలి.