Advertisementt

ఆనాడు లగడపాటికి.. భయపడ్డారంట .!

Fri 22nd Jul 2016 07:41 PM
lagadapati rajagopal,ponnam prabhakar,pepper spray,division of ap state  ఆనాడు లగడపాటికి.. భయపడ్డారంట .!
ఆనాడు లగడపాటికి.. భయపడ్డారంట .!
Advertisement
Ads by CJ

రాష్ట్ర విభజన సందర్బంగా నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆత్మహత్యాయత్నం చేసుకుంటాడని తాము భయపడినట్లు తెలంగాణ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆనాటి స్దితిని ఓ చానెల్‌కు వివరించారు. విభజన బిల్లును ఎలాగైనా అడ్డుకుంటానని లగడపాటి బెదిరించడంతో తెలంగాణ ఎంపీలంతా ఆ ముందురోజు సమావేశమై లగడపాటి ఏమి చేస్తాడో అని చర్చించుకున్నామని, పార్లమెంట్‌లో ఆయన ఏమి చేసినా ఆయన్ను అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. లగడపాటి మాత్రం తన బ్యాగు నిండా సెంట్‌ బాటిళ్లు వంటివి తీసుకొచ్చాడని, దాన్ని అందరిపైకి స్ప్రె చేశాడని, తమ కళ్లు మండిపోయాయని, దాంతో కళ్లుపోయాయని భయపడ్డామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆసుపత్రిలో చేరిన తర్వాత కళ్లమంట తగ్గిందని, అది పెప్పర్ స్ప్రే అని తెలిసి తాము ఆయన దైర్యానికి ఆశ్చర్యపోయామని పొన్నం వివరించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ