Advertisementt

అప్పుడే దసరా లిస్ట్ లోకి 3 చిత్రాలు!

Fri 22nd Jul 2016 02:25 PM
dasara,vijaya dasami,kalyan ram,ram charan,ram,dhruva,ism,hiper  అప్పుడే దసరా లిస్ట్ లోకి 3  చిత్రాలు!
అప్పుడే దసరా లిస్ట్ లోకి 3 చిత్రాలు!
Advertisement
Ads by CJ

వేసవి, సంక్రాంతి తర్వాత సినిమా వాళ్లకు బాగా ఇష్టమైన సీజన్‌ దసరా. కాగా ఈ ఏడాది రాబోయే దసరాకి ఇప్పటివరకు ముగ్గురు యంగ్‌ హీరోలు తన చిత్రాలను లాక్‌ చేసుకున్నారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మాతగా తమిళ 'తని ఒరువన్‌'కు రీమేక్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వలో రూపొందుతున్న 'ధృవ' చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈచిత్రాన్ని అక్టోబర్‌ 7న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇజం' చిత్రాన్ని సెప్టెంబర్‌ 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ హీరోగా సంతోష్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'హైపర్‌' చిత్రాన్ని కూడా సెప్టెంబర్‌ ద్వితీయార్దలోనే విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. మొత్తానికి ఈ దసరాకి ఇప్పటివరకు ముగ్గురు యంగ్‌ హీరోలు తమ బెర్త్‌లు రెడీ చేసుకున్నారు. మరికొన్ని చిత్రాలు కూడా ఇదే సమయంలో విడులయ్యే అవకాశాలున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ