Advertisementt

'శ్రీమంతుడు' కిక్ అలాంటిది మరి!

Fri 22nd Jul 2016 01:49 PM
srimanthudu,koratala siva,mahesh babu,again mahesh babu in koratala direction  'శ్రీమంతుడు' కిక్ అలాంటిది మరి!
'శ్రీమంతుడు' కిక్ అలాంటిది మరి!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మలిచిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా 'జనతాగ్యారేజ్‌' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌2న విడుదల కానుంది. కాగా ఈ చిత్రం తర్వాత కొరటాల శివ నిర్మాత డి.వి.వి.దానయ్యకు ఓ సినిమా చేయాల్సివుంది. కొరటాల చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి మరలా మహేష్‌బాబు.. కొరటాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. 'శ్రీమంతుడు' టైం లోనే మరో మూవీ చేయడానికి నేను రెడీ అని కొరటాలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన మహేష్..ఓ మూవీ గ్యాప్ తర్వాత కాంబినేషన్ ని రీపీట్ చేయనున్నాడు. ప్రస్తుతం మహేష్‌ త్వరలో ప్రారంభం కానున్న మురుగదాస్‌ చిత్రంలో నటించనున్నాడు,. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.ఈ చిత్రం తర్వాతి చిత్రంగా మహేష్‌, కొరటాల శివ-డి.వి.వి.దానయ్యల కాంబినేషన్‌లో రూపొందే చిత్రం ఉండనుంది. ఈ చిత్రం తర్వాత మహేష్‌ పూరీజగన్నాథ్‌తో 'జనగణమన', వంశీపైడిపల్లితో పివిపి సినిమాలు చేస్తాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ