రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుకు తాము మద్దతిస్తామని మొదట టిఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు ప్రకటించారు. కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ టిఆర్‌ఎస్ పార్టీ ఈ మాటను మార్చింది. కేటీఆర్ మాట్లాడుతూ, ఆ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేది లేదని చెప్పాడు. హైకోర్టు విభజన విషయంలో ఏదైనా బిల్లు పెడితే తాము మద్దతిస్తామని మెలికపెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా ప్రవేట్ బిల్లు విషయంలో టిఆర్‌ఎస్ మాటమార్చడానికి వెంకయ్యనాయుడును కారణంగా చెబుతున్నారు. ఆయన కేసీఆర్‌కు ఫోన్ చేసి మంతనాలు జరిపిన తర్వాతే టిఆర్‌ఎస్ స్వరం మార్చిందని విశ్లేషకులు అంటున్నారు. అయినా ఆంధ్రాపై ఎంతో ద్వేషం ఉన్న టిఆర్‌ఎస్ ఏపీకి ప్రత్యేకహోదా బిల్లుకు మద్దతిస్తుందని భావించడం తెలివితక్కువే అవుతుందంటున్నారు ఏపీ సానుభూతిపరులు.