వరుసగా చిత్రాలు చేస్తూ మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న మాస్‌మహారాజా రవితేజ 'బెంగాల్‌టైగర్' చిత్రం తర్వాత మరో సినిమా చేయలేదు. దిల్‌రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్‌తో చేయాల్సిన 'ఎవడో ఒకడు' చిత్రం అనేక కారణాల వల్ల మొదలేకాలేదు. తాజాగా ఆయన కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' అనే చిత్రం చేయనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అది కూడా పట్టాలెక్కే పరిస్థితులు లేవని స్ఫష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఓ కొత్త దర్శకుడు విక్రమ్ సిరి చెప్పిన సబ్జెక్ట్‌కు రవితేజ ఓకే చెప్పాడని, ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా ఈచిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ చిత్రమైనా ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పట్టాలెక్కుతుందో లేదో వేచిచూడాల్సివుంది..!