కబాలి సినిమా దేశ వ్యాప్తం గా రేపు(జులై 22) విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్న తరుణం లో ఈ సినిమా విడుదల ఆపాలని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ హైకోర్టు కి వెళ్లారు. కబాలి విడుదల కాకుండా స్టే విధించాలని లింగా సినిమా డిస్ట్రిబ్యూటర్ మహా ప్రభు హై కోర్టు ని ఆశ్రయించారు. 2014లో వచ్చిన లింగా సినిమా వల్ల తానూ భారీగా నష్టపోయాను కాబట్టి నాకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆ సినిమా నిర్మాతలు చెప్పారని కానీ నష్ట పరిహారం ఇవ్వలేదని చెప్పారు. దీనికి హీరో రజినికాంత్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. కానీ తనకు రావాల్సిన 89 లక్షల రూపాయలు ఇంకా చెల్లించలేదని అందుకే నా డబ్బు నాకు చెల్లించాకే.. కబాలి సినిమాను విడుదల చెయ్యాలని కోర్టు ని కోరారు. కానీ హైకోర్టు ఈ స్టే ని కొట్టి వేసింది. కబాలి సినిమా విడుదల చేసుకోవచ్చని చెప్పింది. ఇక ఈ సినిమాను అనుకున్నట్లు గానే శుక్రవారం రిలీజ్ అవుతుందని కబాలి సినిమా నిర్మాత కలైపులి థాను ప్రకటించారు. కబాలి సినిమాను ఆపడానికి కోర్టు స్టే విధించిందని తెలిసిన రజినీకాంత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. కానీ కోర్టు స్టే ని ఎత్తివేయడం తో సినిమా విడుదలకు సిద్హమవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు.