ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో 22వ తేదీన చర్చ, ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగకుండా చేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ బిల్లుపై చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని బాబు అండ్ కో కూడా ఎంతో ఆశతో ఉంది. అదే బిల్లు చర్చకు వచ్చి ఓటింగ్ జరిగితే బిజెపికి ఇబ్బందులు తప్పదు. తమ మిత్రపక్షమైన టిడిపి బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించడం బిజెపి అధిష్టానానికి నచ్చలేదు. దీనికి విరుగుడుగా వైసీపీ పార్టీ కోరినట్లుగా ఫిరాయింపుల చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది. టిడిపి, కెవిపి బిల్లుకు మద్దతునిస్తే పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు చేర్పులు చేసి ఏపీలో వైసీపీ ఎమ్మేల్యేలను చేర్చుకున్న టిడిపి పార్టీపై బదులు తీర్చుకోవాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.