గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు... చినబాబు నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో గ్రేటర్‌లో మంచి బలం ఉందని భావించిన టిడిపికి ఓటర్లు షాక్ ఇచ్చారు. దాంతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లడం కూడా తగ్గించాడు లోకేష్. కాగా ఇటీవల చంద్రబాబును కలసిన టిటిడిపి నాయకులు లోకేష్‌కు తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు, కార్యకర్తల్లో మరలా ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపేందుకు భాద్యతలు అప్పగించాలని కోరారు. కానీ ఈ విషయలో చంద్రబాబు.. లోకేష్‌ను పూర్తిగా తెలంగాణకు పంపించను, లోకేష్‌తో పాటు నేను కూడా తెలంగాణపై దృష్టి పెట్టి, పార్టీని గాడిలో పెట్టేందుకు సమయాన్ని వెచ్చిస్తామని తేల్చిచెప్పాడు. ఇప్పట్లో తెలంగాణలో టిడిపి మరలా పూర్వవైభవం సాధించడం అసాధ్యమని, అక్కడకు లోకేష్‌ను పంపితే ఆయన అటు తెలంగాణ, ఇటు ఏపీకి కాకుండా పోతాడనే ఉద్ధేశ్యంతోనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని టిటిడిపి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.