Advertisementt

అసదుద్దీన్‌ కథ అడ్డం తిరిగింది!

Thu 21st Jul 2016 02:33 PM
asaduddin owaisi,mim,nia,muslims,hyderabad  అసదుద్దీన్‌ కథ అడ్డం తిరిగింది!
అసదుద్దీన్‌ కథ అడ్డం తిరిగింది!
Advertisement
Ads by CJ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఐసిస్‌ సానుభూతి పరులకు న్యాయసహాయం చేస్తానని ప్రకటించడం తీవ్ర దుమారాన్నే రేపింది. ఈ విషయంలో అసదుద్దీన్‌పై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. కాగా ఇప్పుడు అరెస్ట్‌ కాబడిన ఐసిస్‌ ఉగ్రవాదుల సానుభూతిపరులకు చెందిన కుటుంబసభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమకు న్యాయసహాయం చేస్తానని చెప్పడం ద్వారా ఒవైసీ అన్నిపార్టీలలాగే తమను ఓటుబ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాడని వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అసలు తమ వారు ఉగ్రవాదులు కాదని, వారిని ఎన్‌.ఐ.ఎ. తప్పుడు కేసు నమోదు చేసి మానవ హక్కులను ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. దీంతో అసదుద్దీన్‌కు ఇప్పుడు సంకట పరిస్థితి నెలకొంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ