Advertisementt

'కబాలి' టాక్ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!

Thu 21st Jul 2016 02:30 PM
kabali,kabali premiere in usa,kabali talk,kabali result,rajinikanth,kabali review,kabali telugu movie  'కబాలి' టాక్ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!
'కబాలి' టాక్ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!
Advertisement
Ads by CJ

రజినీకాంత్ 'రోబో' తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా రజిని సినిమా వస్తుందంటే ఆ మజానే వేరు. అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న 'కబాలి' సినిమా అమెరికాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇంకేముంది 'కబాలి' హిట్ అయ్యిందనే  వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఈ సినిమా ఇండియా అంతటా రేపు(జులై 22) రిలీజ్ అవుతుంది. అమెరికాలో వేసిన స్పెషల్ షో ని రజినీకాంత్ ఫ్యామిలీతో చూసారని సమాచారం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అయ్యారని... ఇదంతా చూసిన రజినీకాంత్ తృప్తి పడ్డారని టాక్. ఈ సినిమా అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇక్కడ ఇండియా లో ఇంకా అంచనాలను పెంచేసింది. మరి రజిని స్టామినా అంటే దీనిని బట్టే అర్ధమవుతుంది. అయితే అక్కడ ఎన్నారై లు ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమా ఉందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా వీరు హీరో ఇంట్రడక్షన్ సీన్ ని వీడియో తీసి వాట్స్ అప్ లో పెట్టారు. ఈ వీడియో 2 నిమిషాల నిడివితో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పటికే 'కబాలి' పై వున్న అంచనాలు అమాంతం గా పెరిగిపోయాయి. సదరు ప్రేక్షకులకు టిక్కెట్స్ దొరకనంతగా ఈ సినిమా టికెట్స్ బుక్ అయ్యాయి అంటే 'కబాలి' పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అర్ధమవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ