Advertisementt

బాబుకు బాగా.. జ్ఞానోదయమైంది!

Thu 21st Jul 2016 02:21 PM
chandrababu,krishna pushkaraalu,no publicity,godavari pushkaraalu  బాబుకు బాగా.. జ్ఞానోదయమైంది!
బాబుకు బాగా.. జ్ఞానోదయమైంది!
Advertisement
Ads by CJ

ఈమధ్య హైటెక్‌ సీఎం చంద్రబాబు ప్రతి విషయంలోనే పబ్లిసిటీని కోరుకుంటున్నారు. ప్రతి విషయాన్ని తమ ప్రభుత్వం సాధించిన విజయంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం త్వరలో జరగనున్న కృష్ణ నది పుష్కరాళ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ విషయంలో రాత్రింబగళ్లు కష్టపడుతోంది. కోట్లాదిరూపాయలను ఖర్చు చేస్తోంది. పుష్కరాళ సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని బాబు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఈ పుష్కరాళ విషయంలో ప్రచార ఆర్భాటం తగ్గించాలని బాబు నిర్ణయించాడని సమాచారం. గత గోదావరి పుష్కరాళ విషయంలో విపరీతమైన పబ్లిసిటీ చేయడం వల్లే భక్తుల తోపులాటలో పలు ప్రాణాలు బలికావడం తెలిసిందే. ఈ విషయాన్ని మీడియా కూడా బాగా హైలైట్‌ చేసింది. ఇక ప్రతిపక్షాలైతే దీనికి కారణం కేవలం చంద్రబాబే అని దుమ్మెత్తిపోశాయి. దాంతో బాబుకు ఈ విషయంలో జ్ఞానోదయం అయింది. అందుకే కేవలం అవసరమైన మేరకే ప్రచారం చేయాలని, ఎక్కువ ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నాడని సమాచారం. మొత్తానికి బాబుకు బాగానే జ్ఞానోదయం అయిందని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ