2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ... మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమని వ్యాఖ్యానించాడు. ఈ మాటలను బిజెపితో పాటు ఆరెస్సెస్ వర్గాలు కూడా తీవ్రంగా ఖండించాయి. తెలిసి తెలియక మాట్లాడి, తమ పరువుకు నష్టం చేకూర్చాడని ఆరెస్సెస్ సుప్రీంకోర్టులో రాహుల్‌పై కేసు వేసింది. తాజాగా ఈ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు కూడా రాహెల్‌గాంధీపై మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తావని సుప్రీం రాహుల్‌ను ప్రశ్నించింది. ఇక రాహుల్‌కు ఈ విషయంలో రెండు మార్గాలను సూచించింది. ఒకటి... ఈ వ్యాఖ్యలపై రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పి, తన తప్పు ఒప్పుకోవాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని. లేని పక్షంలో విచారణకు సిద్దంగా ఉండాలని సూచించింది. ఈ తీర్పుపై హిందు మత సంస్థలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బిజెపికి కూడా ఇది తీపి వార్తే అనడంలో సందేహం లేదు. మరి సుప్రీం సూచించిన రెండు మార్గాల్లో రాహుల్‌గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది.