Advertisementt

అల్లు అర్జున్ రెండోస్సారి......!?

Thu 21st Jul 2016 02:10 PM
allu arjun,allu sneha,allu ayaan,allu arjun second baby,conform,social media,photo  అల్లు అర్జున్ రెండోస్సారి......!?
అల్లు అర్జున్ రెండోస్సారి......!?
Advertisement
Ads by CJ

ఈ మధ్య హరిత హారం ఈవెంట్ లో పాల్గొని అల్లు అర్జున్, స్నేహ తమ ఇంటి ఆవరణలోనే మొక్కలు నాటారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ మామ, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇంకా తనయుడు అల్లు అయాన్ కూడా పాల్గొని మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంటుకి వచ్చిన స్నేహ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరిగింది. ఇంతకుముందే స్నేహ ప్రెగ్నెంట్ అని ఆమెను సంతోషం గా ఉంచడం కోసం అల్లు అర్జున్ కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళొచ్చాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇలాంటి ప్రచారం జరుగుతున్న వేళ ఒక ఫోటో బయటికి వచ్చింది. ఈ ఫొటోతో నిజం గానే అల్లు అర్జున్ రెండోసారి తండ్రి కాబోతున్నాడని కన్ఫర్మ్ అయ్యింది.  ఫొటోలో స్నేహ కడుపులోని బేబీని పెద్ద కొడుకు అయాన్ ముద్దాడుతున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఇక అల్లు అర్జున్ ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి ఈ ఫోటో పోస్ట్ చేసాడు. ఇక త్వరలో అల్లు అయాన్ కి బుల్లి తమ్ముడో లేక చెల్లెలో పుడుతుందన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ