చిరంజీవి 150 వ సినిమా ఎలా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారో అని ఎన్నో కథలు విన్నా చిరుకి ఏ కథ నచ్చలేదు. అయితే రైతు సమస్యల నేపథ్యం లో తమిళం లో వచ్చిన 'కత్తి' కథకే చిరు ఓటు వేశాడు. అయితే టైటిల్ విషయంలో మాత్రం పెద్దగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు లేరు. అందుకే 'కత్తి' రీమేక్ కి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ సెట్ అవుతుందని భావించి ఆ టైటిల్ నే ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చారు. చిరంజీవి కూడా ఈ టైటిల్ ని ఒకే చేసాడని కూడా అన్నారు. కానీ 'కత్తిలాంటోడు' టైటిల్ చరణ్ కి పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. ఈ విషయం రీసెంట్ గా ఫేస్ బుక్ లైవ్ వీడియో చాట్ లో కూడా తెలిపాడు. అందుకే ఈ మూవీ కోసం మంచి టైటిల్ పెట్టాలని తెగ ఆలోచిస్తున్నాడట. అయితే 150 వ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఈ సినిమాకి 'కత్తిలాంటోడు' అనే అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ అందరికి రీచ్ అయ్యింది కూడా. మారాలాంటప్పుడు ఇప్పుడు ఇంకో టైటిల్ గురుంచి ఆలోచించడం అవసరమా అని కొందరంటున్నారు. కానీ రామ చరణ్ మాత్రం వారి మాటలను పట్టించుకోవడం లేదట.150 వ సినిమాలో చిరంజీవి రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఒక పాత్రలో చిరు సైంటిస్ట్ గాను, మరో పాత్రలో దొంగగాను కనిపించనున్నాడు. అయితే చిరంజీవి ఖైదీ పాత్రకు సంబంధించి జైలులో వేసుకునే షర్ట్ కి ఖైదీ నెం 150 అని వేయించాడట ఈ సినిమా డైరెక్టర్ వి.వి.వినాయక్. అయితే అది చూసిన రామ్ చరణ్ ఈ సినిమాకు 'ఖైదీ నెం 150' అని పెడదామని అంటున్నాడట. చిరంజీవికి ఖైదీ పేరు మీద వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. అందుకే 150 వ సినిమాకి కూడా ఖైదీ అనే పేరుతో టైటిల్ పెడదామని రామ్ చరణ్ భావిస్తున్నాడని సమాచారం.