రజనీకాంత్ తాజా సంచలనం 'కబాలి' చిత్రం. అన్ని భాషల్లో ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'కబాలి' అనే పదానికి సరైన అర్థం లేదు. అది తెలుగు పదమే కాదు. అయినప్పటికీ 'కబాలి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో మాత్రం 'కబాలి' అంటే శివుడు అనే అర్థం ఉంది. లార్డ్ శివ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతీయ భాషలో సినిమా రిలీజ్ చేసేపుడు ఆ భాషకు సంబంధించిన పేరు పెట్టడం ఆనవాయితీ. దీన్ని సైతం రజనీ బ్రేక్ చేశారు.
రజనీకాంత్ సినిమాల టైటిల్స్ లో ఎక్కువ భాగం శివునికి సంబంధించినవే ఉంటాయి. ఇది ఆయన నమ్మకమా లేక రజనీ అసలు పేరు శివాజీరావు కాబట్టి అందుకే పెడుతున్నారో తెలియదు. ఒకవేళ సెంటిమెంట్ ప్రకారమే అయితే రజనీ సినిమాలకు గతంలో 'అరుణాచలం', 'లింగ', 'అన్నామలై', 'కోచ్చాడియాన్', 'శివాజీ' అనే టైటిల్స్ పెట్టారు. వీటిలో ఎక్కువ భాగం సక్సెస్ అయ్యాయి.