Advertisementt

మణిరత్నం, అజిత్ లకు ఝలకిచ్చింది!

Wed 20th Jul 2016 02:43 PM
sai pallavi,maniratnam,ajith,sekhar kammula,sai pallavi no to maniratnam and ajith  మణిరత్నం, అజిత్ లకు ఝలకిచ్చింది!
మణిరత్నం, అజిత్ లకు ఝలకిచ్చింది!
Advertisement
Ads by CJ

మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో క్యూట్‌ గర్ల్‌ సాయిపల్లవి క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో ఆమెకు తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో కార్తి హీరోగా నటించే చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా నటించమని లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం పిలిచి ఆఫర్‌ ఇస్తే.. అందులో రొమాంటిక్‌ సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ చిత్రానికి నో చెప్పింది సాయిపల్లవి. ఎవరైనా మణిరత్నం చిత్రంలో అవకాశం అంటే ఎగిరి గంతేస్తారు. చివరకు ఐశ్వర్యారాయ్‌ అయినా అంతే. కానీ సాయిపల్లవి మాత్రం మణిరత్నంకు నో చెప్పింది. తాజాగా ఆమెకు తమిళ స్టార్‌ అజిత్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ తన పాత్రకు అందులో ప్రాధాన్యం లేకపోవడంతో దీనిని కూడా ఆమె చేయనంది. మొత్తానికి కెరీర్‌ స్టార్టింగ్‌లోనే సాయిపల్లవి ఇలాంటి అవకాశాలకు నో చెప్పడం చూసి సినీ జనాలు నోళ్లు వెల్లబెడుతున్నారు. కాగా మొత్తానికి ఈ అమ్మడు తెలుగులో శేఖర్‌ కమ్ముల చిత్రానికి మాత్రం ఓకే చేయడం కాస్తరిలీఫ్‌ అని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ