కెరీర్ ప్రారంభంలో కేరళ కుట్టి నయనతార బాగానే గ్లామర్ షో చేసింది. 'బిల్లా' చిత్రంలో బికినిలో కనిపించి యువతను ఉర్రూతలూగించింది. కాగా వయసు పెరిగే కొద్ది గ్లామర్‌ను కూడా పెంచుకుంటున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. కాగా చాలా కాలం తర్వాత ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించిన 'ఇరుముగన్' చిత్రంలో మరలా మునుపటి గ్లామర్‌షో చేసి శృంగార ప్రియులను సంతోషపెట్టేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌లోనే దాని తాలూకు లక్షణాలు బాగా కనిపించాయి. ఆమె గ్లామర్‌గా కనిపిస్తుండటంతో ఆమె అభిమానులే కాదు... అందరూ ఈ టీజర్‌ను చూసి ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. ఈ చిత్రంలో మరోసారి 'బిల్లా' తర్వాత నయన బికినీలో నటించిందని సమాచారం. ఈ చిత్రం విక్రమ్ కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఇటీవలికాలంలో వరుస చిత్రాలు నిరాశపరచడంతో ఈ చిత్రం హీరోగా విక్రమ్‌కు చాలా కీలకంగా మారింది. నయనతార గోల్డెన్‌లెగ్ తనకు పనికి వస్తుందని భావిస్తున్న విక్రమ్, ఇప్పుడు నయన గ్లామర్‌షోతో తనకు ఎలాగైనా మరో మంచి హిట్టును ఇచ్చి తన కెరీర్‌ను నయన గాడిలో పెడుతుందని గంపెడాశతో ఎదురుచూస్తూన్నాడు.