బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్యనే హీరో అయ్యాడు. ఆయన కేవలం రెండు సినిమాలలో నటించాడు. ఆయన నటించిన మొదటి సినిమాలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తో కలిసి నటించాడు. ఇక రెండో సినిమాలో ఒక మాదిరి పేరు తెచ్చుకున్న సొనారికతో రొమాన్స్ చేశాడు. ఇక ఇప్పుడు బోయపాటి శీను- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతూ బిజీ గా వున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. అంతే కాకుండా శ్రీనివాస్.. నటించిన రెండు సినిమాలలో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తమన్నా తో ఐటెం సాంగ్ లో ఆడి, పాడాడు. అయితే ఈ ఐటెం సాంగ్స్ చేసినందుకు తమన్నాకి భారీగానే ముట్టజెప్పారు. ఇక ఇప్పుడు ఆయన నటించబోయే మూడో సినిమాలో కూడా తమన్నానే ఐటెం సాంగ్ చేయాలని కోరుకుంటున్నాడట. అయితే బోయపాటి తీసే సినిమాలో కచ్చితం గా ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. మరి బోయపాటి, శ్రీనివాస్ రికమండేషన్ ని ఒప్పుకుని తమన్నా ని ఈ సినిమాలో తీసుకుంటాడో లేక మరెవరినైనా ఈ సాంగ్ కోసం తీసుకుంటాడో చూద్దాం. అలా కాకుండా తమన్నానే ఈ సినిమాకి తీసుకుంటే.. మరి ఈసారి ఎలాంటి సాంగ్ లో తమన్నాతో శ్రీనివాస్ డాన్స్ చేయబోతున్నాడో చూడాలి.