Advertisementt

మెగా ఫ్యాన్స్ ఈ దర్శకుణ్ణి బెదిరించారా!

Tue 19th Jul 2016 08:04 PM
chiranjeevi,kodandarami reddy,mega fans,sorry,v.v.vinayak,ram charan,150th film,comedy  మెగా ఫ్యాన్స్ ఈ దర్శకుణ్ణి బెదిరించారా!
మెగా ఫ్యాన్స్ ఈ దర్శకుణ్ణి బెదిరించారా!
Advertisement
Ads by CJ

ఈ మధ్య మెగా స్టార్ చిరంజీవి నటించబోయే 150 వ సినిమా గురించి దర్శకుడు కోదండరామి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చిరంజీవి ని ఉద్దేశించి చిరంజీవి 150 వ సినిమా ప్రజలకు సందేశాలు ఇచ్చేలా ఉంటే ఆ సినిమా ఎవరు చూడరని అన్నారు. ఆయన గనుక చిరు తో సినిమా తీస్తే అది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు. చిరంజీవి బాడీ అంతా కామెడీతో నిండి ఉంటుందని అందుకే చిరు కామెడీని నమ్ముకుంటే బావుంటుందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద దుమారాన్నే లేపాయి. దీనిపై అంతటా దుమారం చెలరేగడం తో కోదండరామి రెడ్డి ఈ విషయమై స్పందించారు. ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటలు టీవీ ఛానెల్స్ లో చూసే వరకు తనకు తెలీదన్నారు. నేను ఆయన్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని ఆయన హాస్యానికి పెద్దపీట వేస్తే బావుంటుందని అన్నానని... అయితే నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని అన్నారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశామని ఆ చనువుతోనే అలా మాట్లాడానని.. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని బాధపడుతూ.. తన మనసులో మాట బయటపెట్టారు.  దేవుడి సాక్షిగా చెబుతున్న నేను ఏదో యదాలాపం గా మాట్లాడానని... నేను పొరపాటున మాట్లాడాను కాబట్టి చిరంజీవికి, రామ్ చరణ్ కి, వి.వి.వినాయక్ కి అలాగే మెగా అభిమానులకి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ