ప్రస్తుతం రామ్‌చరణ్.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై తమిళ 'తని ఒరువన్' రీమేక్‌గా చేస్తున్న 'ధృవ' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఆడియో ఫంక్షన్ జరుపనున్నారు. ఈ చిత్రానికి తమిళంలో సంగీతం అందించిన హిపాప్ తమిజనే తెలుగులో కూడా సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈచిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. అందుకే సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఉండేందుకు ఈచిత్రంలో కేవలం మూడే పాటలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలోలా ఈ చిత్రంలో ఆరుపాటలు, ఆరు ఫైట్స్ ఉండవని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే కానీ తెలియదు. ఒక వేల నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. ఎందుకంటే 6 నుండి 5 పాటలకు తగ్గిపోయిన ప్రస్తుత సినిమాల్లో..చరణ్ సినిమాలో కేవలం మూడే పాటలంటే..ఫ్యాన్స్ కి నిజంగా నిరాశ తప్పదు. అందునా..చరణ్ డాన్స్ కోసం, స్టెప్స్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ ని ఈ విషయం డిజప్పాయింట్ చేసేదే మరి.