వాస్తవానికి దక్షిణాదిలో ఈమద్యకాలంలో హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్‌కు తెరతీసింది కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్సే అని చెప్పాలి. ఆయన చేసి, తీసిన 'ముని, కాంచన, గంగ' వంటి చిత్రాలతో లారెన్స్ సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ముని సిరీస్‌లో భాగంగా మరో చిత్రాన్ని తానే నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్నాడు. ఈమధ్యకాలంలో లారెన్స్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'రెబెల్' తప్ప అన్ని హర్రర్ కామెడీ చిత్రాలే కావడం విశేషం. ఇప్పుడు లారెన్స్‌కి వున్న ఈ క్రేజ్‌ను బయటి దర్శకులు కూడా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగు భాషలతో పాటు కన్నడలో కూడా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా పి.వాసు ఇటీవల ఈ చిత్రానికి సీక్వెల్‌ను కన్నడలో తీసి మరో హిట్ కొట్టాడు. దాంతో 'చంద్రముఖి2'ని రజనీకాంత్‌తోనే తీయాలని పి.వాసు ఆశపడ్డాడు. కానీ రజనీ ఈ చిత్రం చేయనని తేల్చేశాడు. దాంతో పి.వాసు కన్ను లారెన్స్‌పై పడింది. తన దర్శకత్వంలో లారెన్స్ హీరోగా 'చంద్రముఖి2'(శివలింగ)ను పి.వాసు ప్రారంభించాడు. మొత్తానికి లారెన్స్ ప్రస్తుతం దెయ్యాలను దత్తత తీసుకున్నాడని కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.