Advertisementt

ఎన్టీఆర్‌ని ఈ సెంటిమెంట్‌ ఏం చేస్తుందో?!

Mon 18th Jul 2016 05:16 PM
jr ntr,sentiment,hero birthday,movie releases in heroes birthdays,young tiger ntr  ఎన్టీఆర్‌ని ఈ సెంటిమెంట్‌ ఏం చేస్తుందో?!
ఎన్టీఆర్‌ని ఈ సెంటిమెంట్‌ ఏం చేస్తుందో?!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్‌'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి రెండు బ్యాడ్‌ సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి. వినాయక్‌ నుంచి బోయపాటి శ్రీను వరకు, హరీష్‌శంకర్‌ నుంచి సురేందర్‌ రెడ్డి వరకు హిట్లు ఇచ్చిన దర్శకులతో ఎన్టీఆర్‌ చేసిన చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీనికి కొంతవరకు రాజమౌళి, వినాయక్‌లు మినహాయింపు. కాగా ఒక హీరో పుట్టినరోజునాడు విడుదలైన మరో హీరో చిత్రాలు ఇటీవలి కాలంలో డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఏప్రిల్‌8న అల్లుఅర్జున్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌', మే20న ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం నాడు విడుదలైన మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 'జనతాగ్యారేజ్‌' విడుదలకానున్న సెప్టెంబర్‌ 2న పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే కావడం విశేషం, మరి ఈ బ్యాడ్‌ సెంటిమెంట్లను ఎన్టీఆర్‌ అధిగమిస్తాడో? లేదో? వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ