సాధారణంగా కేబినెట్ మంత్రుల కింద ఉండే సహాయమంత్రులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఏ శాఖకు సంబంధించిన వ్యవహారమైనా అది కేబినెట్ మంత్రుల స్ధాయిలోనూ జరుగుతుంది. ఇక్కడ సహాయ మంత్రులకు పనేమి లేక కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగులున్నారు. ఓ స్దాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది సీనియర్ మంత్రుల అభీష్టమే జరుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే పద్దతి తరతరాలుగా నడుస్తూ ఉంది. కానీ నేటి మోడీ మాత్రం సహాయమంత్రుల విన్నపాలను అర్ధం చేసుకున్నారు. కేబినెట్ మంత్రులు తీసుకునే ఏ నిర్ణయమైనా సహాయ మంత్రులతో కూడా చర్చించి వారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని మోడీ కేబినెట్ మంత్రులకు హుకుం జారీ చేశాడని సమాచారం. నిర్ణయాలలో సహాయమంత్రులు కూడా పాలుపంచుకుంటేనే వారికి అనుభవం వస్తుందని, జూనియర్లలో కూడా ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని మోడీ భావిస్తున్నాడు. దీంతో జూనియర్లంతా మోడీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీనియర్లు మాత్రం ఈ నిర్ణయం వల్ల శాఖాపరమైన నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం తగ్గుతుందనే బాధపడుతున్నారు. మొత్తానికి మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పరిపాలన మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని, సీనియర్లకు పనిభారం కూడా తగ్గడం వల్ల పరిపాలన మరింత బాగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.