Advertisementt

విజయశాంతి, అజార్..ఇద్దరూ డౌటే..!

Mon 18th Jul 2016 02:45 PM
vijayasanthi,azhar,telangana pcc chief,congress  విజయశాంతి, అజార్..ఇద్దరూ డౌటే..!
విజయశాంతి, అజార్..ఇద్దరూ డౌటే..!
Advertisement
Ads by CJ

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌ను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలోని అధికశాతం కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌ పని తీరు పట్ల అసహనంగా ఉన్నారు. ఆయన పార్టీని బలోపేతం చేయడానికి కష్డపడకుండా ఆ పదవిని ఎంజాయ్‌ చేస్తూ అందరిపై పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు కాంగ్రెస్‌ సీనియర్ల నుండి కూడా వస్తున్నాయి. కాగా ఈ పదవిలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని టిపిసిసిఛీఫ్‌గా నియమించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారిణిగా పేరు తెచ్చుకున్న మాజీ సినీ హీరోయిన్‌ విజయశాంతికి ఈ పదవి ఇస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లను ఢిల్లీ పిలిపించి వారితో చర్చలు జరుపున్నారు. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీనీనటుడు రాజ్‌బబ్బర్‌ను అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇలా ప్రతి రాష్ట్రంలో మరలా పూర్వవైభవం కోసం అధిష్టానం పెనుమార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఇక తెలంగాణ చీఫ్‌ విషయంలో మాజీ కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అజారుద్దీన్‌కు తెలుగు మాట్లాడటం రాదు. ఆయనకు తెలంగాణ పరిస్థితులపై అవగాహన లేదు. దీంతో అజారుద్దీన్‌తో పాటు పెద్దగా రాజకీయ అనుభవం లేని విజయశాంతి పట్ల కూడా సీనియర్లు పెదవి విరుస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ