రైటర్ చిన్నికృష్ణ సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉంటే ఆయన బాధపడాలి, కానీ సాక్షి పేపర్ కు మాత్రం తెగ ఇదనిపించింది. ఆయన ఉన్నాడంటూ పరిశ్రమకు గుర్తుచేయడం కోసమన్నట్టు ఆదివారం ఫుల్ పేజీ ఇంటర్యూ ప్రచురించింది. ఇందులో ఎప్పటిలాగే చిన్నికృష్ణ తన పాత చరిత్రను తిరగేశారు. ఎప్పుడో రాసిన 'నరసింహనాయుడు',' ఇంద్ర', 'గంగోత్రి' సినిమాల గురించి చెప్పుకుని తను సూపర్ హిట్ చిత్రాల రచయితను అంటూ గుర్తుచేసుకున్నాడు. చరిత్ర చెప్పుకోవడానికే కానీ, భవిష్యత్తుకు కాదనే విషయం ఆయనకి బోధపడలేదు. పైగా తను రాసినవన్నీ హిట్ సినిమాలే అంటూ అబద్దం చెప్పాడు. బాలకృష్ణ నటించిన 'సీమసింహం' చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇది ఫ్లాప్ సినిమా. ఇక అల్లు అర్జున్ నటించిన 'బద్రినాథ్' సైతం ఆడలేదని ఆ చిత్ర దర్శకుడు వినాయక్ పలు సందర్భాల్లో చెప్పాడు.
చిన్నికృష్ణకు ప్రచార ఆర్భాటం ఎక్కువ. తన పుట్టినరోజుకు తానే ఇతరుల పేర్లతో శుభాకాంక్షల ప్రకటనలు వేసుకుంటాడనే విషయం తెలిసిందే. రచయితకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అంతే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదనే విషయం చిన్నికృష్ణ గుర్తెరిగితే మంచిది.