Advertisementt

గంటా.. అలా చేశావేంటి..?

Sun 17th Jul 2016 01:33 PM
  గంటా.. అలా చేశావేంటి..?
గంటా.. అలా చేశావేంటి..?
Advertisement
Ads by CJ

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలిరావాలని ఏపీ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పలు ఆఫర్లు.. రాయితీలు ప్రకటించినప్పటికీ...సినీపెద్దలలో పెద్దగా స్పందన లేదు. చంద్రబాబు నాయిడు మాట కాదనలేక.. ఆడపా దడపా తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలు వైజాగ్‌కు వెళ్లి.. స్డూడియోల కోసం స్థలాలు పరిశీలించినప్పటికి.. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు సినీజనాలు. అయితే గత కొంతకాలంగా కొన్ని సినిమాల ఓపెనింగ్స్, ఆడియో ఫంక్షన్లు.. సక్సెస్‌మీట్‌లు ఆంధ్రాలో జరుగుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా అల్లు అర్జున్ సరైనోడు ఆడియో సక్సెస్ వేడుక.. సినిమా సక్సెస్ వేడుక కూడా విజయవాడ, వైజాగ్‌లోనే చేశారు. అయితే ఈ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వేదికపై స్పందిస్తూ ఇక నుంచి సినిమా వాళ్లు తమ ఆడియో వేడుకలు, ప్రారంభోత్సవాలు ఇక్కడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే అందరికి వైజాగ్‌లో సినిమా వేడుకలు జరుపుకోవాలని చెప్పిన గంటా శ్రీనివాసరావు.. తన కొడుకు హీరోగా ప్రారంభించిన కాళహస్తి చిత్ర ప్రారంభోత్సవాన్ని మాత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో చేయడం విశేషం.. సో.. ఇది తెలిసిన ఏపీ మంత్రులు.. ఇదేంటి గంటా ఇలా చేశావని అన్నారట..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ