అల్లరి నరేష్ కు మరోసారి చుక్కెదురైంది. తాజా సినిమా 'సెల్ఫీ రాజా' పరిస్థితి ఆశాజనకంగా లేదు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కలక్షన్లు పూర్తిగా నిరాశపరిచాయి. '.. రాజా'కు మంచి థియేటర్లు దొరికాయి. పోటీ లేదు. అయినప్పటికీ జనాలు థియేటర్లకు రావడం లేదు. ప్రచార ఆర్భాటం, సెంటిమెంట్ వర్కవుట్ అవలేదు. నరేష్ సినిమా అనగానే కామెడీ కొత్తగా ఉండదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
నాలుగేళ్ళుగా సక్సెస్ కోసం చూస్తున్న నరేష్ కింకర్తవ్యం ఏమిటీ.. సక్సెస్ ఎందుకు దూరమైందనే విషయాన్ని గ్రహిస్తున్నట్టు లేదు. తన రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ దూరమయ్యారు. నరేష్ తో సినిమా అంటే చుక్కలు చూపిస్తాడనేది అందరికీ తెలిసిపోయింది. వారెవరూ మరో సినిమా చేయడానికి ముందుకురారు. సమీప బంధువు ఇ.సత్తిబాబు సైతం మరో హీరోని వెతుక్కున్నాడు. దివంగత ఇ.వి.వి. సన్నిహితులు సైతం ముఖం చాటేస్తున్నారు. అందరినీ దూరం చేసుకున్న నరేష్ మళ్లీ కోలుకోవడానికి సమయం పడుతుంది. సినీరంగంలో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ సహజమే అయినప్పటికీ స్వయంకృతపరాధం వల్ల ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం సరిదిద్దుకోవాల్సిందే. ఈ విషయం నరేష్ ఆలోచిస్తాడా...!!