Advertisementt

ఈనాడులో చిరుపై సెటైర్..!

Sat 16th Jul 2016 03:24 PM
chiranjeevi,eenadu,eenadu daily,special artical,top heroines,age limit  ఈనాడులో చిరుపై సెటైర్..!
ఈనాడులో చిరుపై సెటైర్..!
Advertisement
Ads by CJ

'చిరంజీవి పక్కన నటించడానికి టాప్ హీరోయిన్లు ఇష్టపడడం లేదా...?' ఆయన వయసు ఎక్కువ కాబట్టే నిరాకరిస్తున్నారా...? అవునని అంటోంది 'ఈనాడు దినపత్రిక'. ఎప్పుడూ చిరంజీవికి పాజిటివ్ గా ఉండే 'ఈనాడు' శుక్రవారం సినిమా పేజీలో ఒక ఆర్టికల్ లో పరోక్షంగా చిరు గురించే ప్రస్తావించింది. ఓ అగ్రకథానాయకుడి కోసం నయనతార, అనుష్క, కాజల్ ని సంప్రదిస్తే వారంతా మోహమాటం లేకుండా 'నో' చెప్పారని, దీనికి కారణం వయసు భేదం అని  ఆర్టికల్ లో ప్రస్తావించింది. తమ వయసుకంటే రెట్టింపు వయసు హీరోకు ఉందని, రొమాన్స్ సీన్స్ చేయాలంటే ఇబ్బందని రాశారు. ఇదంతా చదువుతుంటే రచయిత ఉద్దేశం స్పష్టమవుతోంది. పైగా చిరు కొత్త సినిమా కోసం నయనతార, అనుష్కను సంప్రదిస్తే వారు నిరాకరించారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నాయికల వయస్సు మూడు పదులైతే చిరంజీవి వయస్సు 60 అనే విషయం తెలిసిందే. 

కేవలం చిరును దృష్టిలో పెట్టుకునే రాసినట్టు స్పష్టమవుతోంది. ఇదే అనుమానం అభిమానుల్లో ఉంది. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత నటిస్తున్న చిరంజీవి పై మీడియాలో రకరకాల కథనాలు రావడం ఆయన సన్నిహితుల్లో ఆశ్చర్యం కలిగిస్తోందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ