త్వరలో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. ఈ సమయంలో పుష్కరాల ఏర్పాట్లలో ఏపీలోని టిడిపి ప్రభుత్వం బిజీ బిజీగా ఉంది. ఈ మధ్య జగన్‌కు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ బాబును తెగ ఇబ్బంది పెడుతోన్న జగన్ కోవర్ట్‌గా పిలుపబడే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి ఇప్పుడు కృష్ణ పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో మరో వివాదం సృష్టించడానికి రెడీ అయ్యాడు. వాస్తవంగా కృష్ణ పుష్కరాలు అంటే ఎక్కువ మంది భక్తులు విజయవాడకే వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కానీ స్వరూపానందేంద్ర స్వామి మాత్రం కృష్ణ నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల పెద్దగా పుణ్యం ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. పట్టిసీమ ప్రాజెక్ట్ తర్వాత కృష్ణ నదిలోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నందువల్ల కృష్ణ నదిలో పుణ్యస్నానం ఫలితాన్ని ఇవ్వదంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణకు చెందిన కొందరు మత పెద్దలు కూడా ఇదే వాదన వినిపిస్తూ స్వరూపాకు వంత పాడుతున్నారు. కానీ పారే నీటికి దోషం ఉండదని కొందరు పీఠాధిపతులు వాదిస్తున్నారు. మొత్తానికి కృష్ణ పుష్కరాలను సైతం వివాదం చేయడానికి స్వరూపాతో పాటు మరికొందరు తెలంగాణ మతపెద్దలు వితండవాదన చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మాత్రం స్పష్టం అవుతోంది.