'బ్రహ్మోత్సవం' సినిమా అనూహ్యంగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడ్డ మహేష్ బాబు తదుపరి సినిమా విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటున్నారట.
మహేష్ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్నిచేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్.వి. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జొడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు బుధవారం దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ట్విట్టర్ లో తెలిపారు. తన సినిమాల్లో ఎదో ఒక సామాజిక అంశాన్ని చర్చించే మురుగదాస్ ఈ సినిమా ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థలోని లోపాల్ని చర్చించబోతున్నారు.
గత కొన్ని నెలలుగా ఇప్పుడా అప్పుడా అంటూ హడావిడి చేస్తూ వస్తున్న ఈ సినిమా ఈ నెల 29 న మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ తో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఇంట్రడక్షన్ సాంగ్ లకు ఇది పూర్తి భిన్నంగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటని 'బాహుబలి' సినిమా కోసం కిలికి భాష ను సృష్టి౦చిన మదన్ కార్కే ఇస్తున్నట్లుగా తన ట్విట్టర్ లో తెలిపారు.