Advertisementt

నాగ చైతన్య 'కళ్యాణం' సమంత తో కాదు!

Fri 15th Jul 2016 03:08 PM
naga chaitanya,samantha,rakul preet singh,kalyan krishna,kalyanam movie,kalyanam movie heroine change  నాగ చైతన్య 'కళ్యాణం' సమంత తో కాదు!
నాగ చైతన్య 'కళ్యాణం' సమంత తో కాదు!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. 'కళ్యాణం' అనే టైటిల్ అనుకుంటున్న ఈ  సినిమాలో నాగ చైతన్య కి జోడిగా సమంత అని అనుకున్నారు అంతా. వీరిద్దరూ కలిసి నటించడానికి సమంత కూడా ఒకే చేసిందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాలో సమంత చేయడం లేదంట. సమంత చేయకపోవడానికి కారణం సంగతి పక్కన పెడితే..ఇప్పుడు సమంత ప్లేసులోకి వేరే హీరోయిన్ వచ్చి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత - నాగ చైతన్య లవ్ లో వున్నారు... త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సమయం లో వీరిద్దరితో..ఈ టైటిల్ తో సినిమా చేస్తే మంచి క్రేజ్ వస్తుందని, సింపుల్ గా హిట్ కొట్టేయవచ్చని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఎంతో ఆశ పడ్డాడు. కానీ అతని ఆశలు నిజం అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. తాజాగా 'కళ్యాణం' కోసం సమంత ప్లేస్ లోకి రకుల్ ని తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ లోని ఏదో ఒక హీరోతో చేసిన రకుల్..ఇప్పటి వరకు చేయని అక్కినేని ఫ్యామిలీ హీరోతో అవకాశం అనగానే వెంటనే ఒప్పేసుకుందంట. అదీ కాక ఈ సినిమా షూటింగ్ టైం కి వేరే ఏ సినిమాతో తన డేట్స్ క్లాష్ అవ్వక పోవడం కూడా ఆమె ఈ మూవీకి ఓకే చెప్పడానికి కారణంగా చెబుతున్నారు.  ఈ మధ్య రకుల్ అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తూ తెగ బిజీ అయిపోయింది. సో..ఇక నాగ చైతన్యతో కూడా రొమాన్స్ చేయడానికి ఆమె రెడీ అవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ