Advertisementt

తెలుగు మీడియా నో ఎంట్రీ చెప్పిన ఆటగత్తే!

Fri 15th Jul 2016 02:55 PM
sania mirza,sania mirza autobiography book,ace against odds,shahrukh khan  తెలుగు మీడియా నో ఎంట్రీ చెప్పిన ఆటగత్తే!
తెలుగు మీడియా నో ఎంట్రీ చెప్పిన ఆటగత్తే!
Advertisement
Ads by CJ

తెలుగు మీడియాకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టెన్సీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలుగు మీడియా అంటే ఇష్టం లేదట. వారికి నో ఎంట్రీ చెప్పింది. ఈ సీన్‌ ఆమె ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగింది. కేవలం ఇంగ్లీష్‌ మీడియాకు మాత్రమే ఆహ్వానం పంపించింది. బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ హాజరవుతున్నారు. సానియా మీర్జా ప్రోగ్రామ్‌ కావడంతో ఆహ్వానం లేనప్పటికీ కొందరు తెలుగు మీడియా మిత్రులు వెళితే వారిని లోపలికి రానివ్వలేదని తెలిసింది. ఇంత జరిగినా మరునాడే వార్తను మాత్రం తెలుగు పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం ఆశ్చర్యం కలిగింది. ఆహ్వానం లేనప్పటికీ, వార్తకు ఉన్న ప్రాధాన్యత వల్ల ప్రచురించక తప్పలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. 

సానియా ఎదుగుదలలో తెలుగు మీడియా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. పలు సందర్భాల్లో ఆమెపై ప్రత్యేక కథనాలు రాసింది. అయినప్పటికీ సానియాకు చిన్న చూపు ఉండడం పట్ల మీడియా వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ఇక ఆత్మకథ ఆవిష్కరణలో సానియా భర్త మాలిక్‌ కనిపించలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ