Advertisementt

రకుల్‌ ప్లేస్‌లో కరెక్ట్‌ హీరోయిన్‌ సెట్టయ్యింది!

Fri 15th Jul 2016 02:09 PM
rakul preet singh,hebah patel,sai dharam tej,gopichand malineni,hebah patel in sai dharam tej movie  రకుల్‌ ప్లేస్‌లో కరెక్ట్‌ హీరోయిన్‌ సెట్టయ్యింది!
రకుల్‌ ప్లేస్‌లో కరెక్ట్‌ హీరోయిన్‌ సెట్టయ్యింది!
Advertisement
Ads by CJ

కుమారి 21ఎఫ్‌ చిత్రంతో కుర్రకారును ఓ ఊపు ఊపిన హెబ్బా పటేల్‌కి ఇప్పుడు ఓ గొప్ప అవకాశం వరించింది. హెబ్బాపటేల్‌ అని చెప్పడానికి కూడా 'కుమారి' అనే వాడుతున్నారంటే..ఆ సినిమాతో హెబ్బాకి ఎటువంటి క్రేజ్‌ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ క్రేజే ఇప్పుడు కుమారిని బిజీ హీరోయిన్‌ని చేస్తుంది. ఇప్పటికే ఓ మెగా హీరోతో నటిస్తున్న హెబ్బాపటేల్‌కు ఇప్పుడు మరో మెగా హీరోతో నటించే అవకాశం వచ్చింది. అదీ కూడా టాప్‌ హీరోయిన్‌ వదిలేసుకున్న అవకాశం కావడం విశేషం. 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ 'మిస్టర్‌' సినిమాలో లావణ్య త్రిపాఠితో కలిసి నటిస్తున్న హెబ్బాకు ఇప్పుడు మరో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ మూవీలో అవకాశం వచ్చింది. సాయి, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ కోసం హెబ్బాపటేల్‌ని ఓకే చేసినట్లుగా తాజా సమాచారం. అంతకు ముందు ఈ ప్లేస్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని అనుకున్నారు. కానీ మహేష్‌ మూవీలో అవకాశం రావడంతో..రకుల్‌ ఈ అవకాశాన్ని వదిలేసుకుంది. దీంతో ఈ అవకాశం హెబ్బాను వరించింది. మరి ఇద్దరు మెగా హీరోలతో చేసే అవకాశాన్ని దక్కించుకున్న ఈ అమ్మడు.. మెగా ఫ్యామిలీలోని టాప్‌ హీరోలతో కూడా చేసి..మెగా హీరోయిన్‌గా మారుతుందేమో..చూద్దాం..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ