మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల తర్వాత నటిస్తున్న తమిళ 'కత్తి' రీమేక్‌పై కావాలనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అసలు చిరంజీవి 150వ సినిమా కోసం ఈ తమిళ మూవీని ఎన్నుకోవడమే పెద్ద తప్పుగా కథనాలు కూడా ప్రచురిస్తున్నారు. తన 150 కోసం ఎన్నో కథలు విన్న చిరు.. చివరికి ఈ సినిమానే చేయడానికి అంగీకరించాడంటే..ఎంతో కొంత విషయం ఉండే ఉంటుంది. అదీకాక ఠాగూర్ వంటి సక్సెస్‌ని ఇచ్చిన వినాయక్..ఈ ప్రెస్టీజీయస్ మూవీని డైరెక్ట్ చేస్తుండటం, పరుచూరి బ్రదర్స్ కథలో మార్పులు చేయడంతో పాటు..ఈ సినిమాకి మాటలు అందించడం వంటి వాటిని కూడా ప్రక్కన పెట్టి..అసలు చిరంజీవి ఈ సినిమా చేయడమే వేస్ట్ అన్నట్లుగా కథనాలు రాయడంను.. మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరికొందరైతే చిరంజీవి తన 150వ చిత్రంగా పూరీతో 'ఆటోజానీ'నే చేయాల్సిందని, బాలకృష్ణ తన 100వ చిత్రం కోసం స్టయిట్ చిత్రం చేస్తున్నట్లుగా..చిరు కూడా 'ఆటోజానీ' చేస్తే మంచి క్రేజ్ వచ్చేదని అంటుంటే..ఇంకొందరు..చిరంజీవి 'కత్తి' రీమేక్ షూటింగ్‌లో తడబడుతున్నాడని, సీన్ సీన్‌కి మానేటర్‌లో చూసుకుని..తన నటనపై దిగులు చెందుతున్నాడనే కథనాలు రాయడం వెనుక కూడా ఈ సినిమాని కిల్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి కథనాలను మెగా ఫ్యాన్స్ ఖండిస్తున్నప్పటికీ..వారిలో కూడా ఓ రకపు ఆలోచనలను క్రియేట్ చేసేంతగా కథనాలు ఉండటం ఆలోచించాల్సిందే మరి.